విద్యాసంస్థలు బంద్ విజయవంతం
అల్లూరి ముచ్చట్లు:
డుంబ్రిగూడ మండల కేంద్రం లో ఉన్న అన్ని పాఠశాలలు కళాశాలలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ బంద్ పిలుపు మేరకు ఈరోజు బంద్ ని విజయవంతంగా చేశారు.విద్యార్థుల సమస్యలు ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వి రామూర్తి మాట్లాడుతూ విద్యార్థులు నెలకొన్న సమస్యలు నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి మూడు నాలుగు ఐదు తరగతిలు విలీనం ఆపాలి జిఓ నెంబర్ 84,85,117,128 లను రద్దు చేయాలి.హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి 3600 రూ పెంచాలి.అందరికీ అమ్మ ఒడి విద్య దీవెన వసతి దీవెన అందించాలి బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి పెంచిన బస్సు పాస్ చార్జీలు తగ్గించాలి కామన్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు చేయాలి జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని తదితర విద్యార్థుల డిమాండ్ ఉన్నాయి విద్యార్థులతో మాట్లాడుతూ బందును విజయవంతం
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం డుంబ్రిగూడ మండల కార్యదర్శి పి సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Educational Institutions Bandh Successful
