Natyam ad

భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఈఈ

చౌడేపల్లె ముచ్చట్లు:
 
స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. రూ:3 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణపనులతోపాటు, మౌళిక వసతుల ఏర్పాటు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు సిమెంటు రోడ్డు ఏర్పాటు చేశామని, చుట్టూ పూల వెహోక్కలతోపాటు పార్క్ తరహాలో అభివృద్దికి చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో మంత్రి పెద్దిరెడ్డి చే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, పిఆర్‌డిఈఈ ప్రసాద్‌, ఏఈ పురుషోత్తం ఉపసర్పంచ్‌ అల్తాఫ్‌ తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: EE who examined the building works