తెలంగాణ ప్రజల కోసం ప్రయత్నం : విజయమ్మ నాన్న దీవిస్తున్నారు విజయం సాధిస్తాం : షర్మిల

కడప   ముచ్చట్లు:

ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉదయం నుండి ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ప్రతీ ఏటా వైఎస్సార్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా నివాళి అర్పించే వారు. గత ఏడాది నుండి మాత్రం ఇలా.. అన్నా..చెల్లి వేర్వేరుగా ఘాట్ వద్దకు వస్తున్నారు. ఇక, తెలంగాణ లో మరి కొద్ది గంటల్లో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పటు ప్రకటన చేయనున్నారు. తన తండ్రి జన్మదినం నాడు తన నూతన పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం కావటంతో షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు.ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన కుమార్తె-కుమారుడుతో కలిసి దివంగత నేత సమాధి వద్ద కూర్చొని చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. తల్లి విజయమ్మ..వైఎస్ వివేకా కుమార్తె సునీత సైతం ప్రార్దనల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచారు. ముందుగానే కుటుంబ సభ్యులతో కలసి షర్మిల ..విజయమ్మ ఇడుపుల పాయ చేరుకున్నారు. పార్టీ నేతలు ఇందిరా శోభన్, పిట్టా రాం రెడ్డి, కొండా రాఘవ రెడ్డి సైతం ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన తండ్రికి నివాళి అర్పిస్తూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. దీనిని చూసిన పార్టీ నేత కొండా రాఘవరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. నివాళి కార్యక్రమం ముగిసిన తరువాత తల్లి..కుటుంబ సభ్యులు..పార్టీ నేతలతో కలిసి షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరుతారు.భ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఇక అసలు విషయానికొస్తే, షర్మిల నేడు తెలంగాణలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ పార్టీకి తండ్రి పేరు మీదుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేయడం తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఆమె ఇడుపులపాయ నుంచి హైదరాబాదు చేరుకుని పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారు.దీనిపై షర్మిల ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. “అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది… నాన్న పైనుంచి దీవిస్తున్నాడు… వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం” అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Effort for the people of Telangana: Vijayamma
Dad Blessing Success: Sharmila

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *