పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కృషి

= జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్

Date:24/02/2020

పెద్దపల్లి ముచ్చట్లు:

జిల్లాలో  కాళేశ్వరం ప్రాజేక్టు పరిధిలో   పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజేక్టు భూ సమస్యల పై సోమవారం కలెక్టర్  ఎన్టిపిసిలోని అతిథి గృహంలో  జడ్పీ  చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే,  సీఎం ఒఎస్డి, కాళేశ్వరం  సీఈలతో కలిసి సంబంధిత

అధికారులతో  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.     కాళేశ్వరం ప్రాజేక్టు  పరిధిలోని బ్యారెజీలను  క్రమపద్దతి ద్వారా పూర్తి స్థాయి నీరు నిల్వ చేసి  పరీక్షించామని, అదే విధంగా  పంప్  హౌజ్

లలోని  మోటార్ల సైతం పరీక్షించడం జరిగిందని, పూర్తి స్థాయిలో  ప్రాజేక్టు పనులు  సత్పలితాలనందిస్తున్నాయని  కాళేశ్వరం  సీఈ వివరించారు.   కాళేశ్వరం ప్రాజేక్టులో  బ్యారేజిలలో నీరు

నిలిపే క్రమంలో బ్యాక్ వాటర్ తో  ముంపుకు గురైన  భూమి వివరాలను  గుర్తించి వారికి పంట నష్టం అందించడానికి  సీఎం ఆదేశాల మేరకు అవసరమైన  చర్యలు తీసుకోవాలని  కలెక్టర్

అధికారులకు సూచించారు.  కాళేశ్వరం ప్రాజేక్టు పరిధిలో జిల్లా వ్యాపితంగా మరొ 633 ఎకరాల భూమి   వివిధ దశలో ఉన్నాయని, వీటిని  నియమాల ప్రకారం  వెంటనే  చర్య తీసుకోవాలని

అన్నారు.   ప్రాజేక్టు పరిధిలో కొన్ని భూములు  సేకరణ సమయంలో నమోదయిన కోర్టు కేసులను  సంబంధిత రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించినందున  సదరు కోర్టు

కేసులు త్వరగా ముగిసేలా అవసరమైన  పత్రాలను సమర్పించాలని  సూచించారు.  సుందిళ్ల బ్యారేజి యొక్క బ్యాక్ వాటర్ తో  మల్కాపూర్, జనగాం గ్రామాలలోని 160 ఎకరాలలో  నష్టం

వాటిల్లిందని, సదరు  రైతులకు పంట నష్టపరిహారం అందించడంతో పాటు ,  జనగాం రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి  సదరు భూముల సేకరణ నిమిత్తం  చెల్లించాల్సిన

నష్టపరిహరం  పై చర్చించాలని  రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్ కోరారు.  నోటిఫికేషన్ వెలువడిన అనంతరం మాత్రమే చర్చలు  జరిపే అవకాశం ఉంటుందని అధికారులు

వివరించారు.   మంథని ప్రాంతంలో  శివలింగం, స్మశానవాటిక ముంపుకు గురవుతున్నాయని,  మల్లారం, వెంకటాపూర్, ఖాసాయన్ పేట్ గ్రామాలలో భూముల పంట నష్టం జరిగిందని,

సదరు భూములకు పంటనష్టం చెల్లించి,  స్మశాన వాటిక నిర్మాణ పనులు, గోదావరి పై  బ్రిడ్జీ నిర్మాణ పనులు చెపట్టాలని   జడ్పీ చైర్మన్   పుట్టమధు  కోరారు.  సుందిళ్ల నుంచి ఆరెంద

వరకు విద్యుత్ వ్యవస్థ  నిలిచిపొయిందని, వెంటనే  విద్యత్ లైన్లను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని  జడ్పీ చైర్మన్ కోరారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం  కాకుండా

చర్యలు తీసుకోవాలని అధికారులను  కలెక్టర్ ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజేక్టు పరిధిలో   బ్యాక్ వాటర్  వల్ల  పంట పొలాలలో నష్టం వాటిల్లకుండా  చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జడ్పీ చైర్మన్ పుట్టమధు,  రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్,  కాళేశ్వరం ఈఎన్సీ  వెంకటేశ్వర్లు,. ఒఎస్డి మనోహర్,అదనపు  కలెక్టర్ లక్ష్మీనారాయణ,  పెద్దపల్లి ఆర్డిఒ  శంకర్ కుమార్,   సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

పట్టణ ప్రగతితో….పట్టణాల రూపు రేఖలు మార్చుదాం.

Tags: Effort to settle pending land disputes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *