జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి

-బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలి

-జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బాలకార్మికుల నిర్మూలనపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలను కార్మికులుగా మార్చకుండా తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని ఇందుకోసం అధికారులు హోటల్లు, పరిశ్రమలు, మెకానిక్ షాపులలో తరచూ తనిఖీలను నిర్వహిస్తూ బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 1 నుండి 30వ తేది వరకు జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారిని రీహ్యబిటేషన్ చేయుడంతో పాటు బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు మండల స్థాయి కమిటీలు నిర్వహించి హోటల్ లలో పరిశ్రమలలో తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.హోటల్స్ లలో బాల కార్మికులు పని చేస్తున్నారో లేదో తనిఖీలు నిర్వహించి రిపోర్టు ఇవ్వాలన్నారు. చిన్న, చిన్న ఫ్యాక్టరీలు, గ్రైనైట్స్ తయారీ, ఇటుకుల బట్టీ తయారీలో బాల కార్మికులు ఉంటే వెంటనే సంబందిత యాజమాన్యం పై కేసులు నమోదు చేయించాలన్నారు. బడి మానేసి పనులకు వెళుతున్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలని విద్యా శాఖదికారులను కలెక్టర్ ఆదేశించారు.1 నుంచి 18 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలందరూ పూర్తి సమయం పాఠశాలల్లో ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అన్నమయ్య జిల్లాలో బాల కార్మికుల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాల కార్మికుల నిర్మూలనపై కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా లేబర్ ఆఫీసర్ రంగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, విద్యాశాఖ అధికారులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Efforts should be made to make the district a child labor free district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *