పురాతనాలయాలకు మహర్దశ కల్పనకు కృషి -శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ మార్కండేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, దుర్గమ్మ ఆలయాలు లో బాలలాయ స్థాపన పూజలను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. పురాతన ఆలయాలను ఆధునీకరించి మహా కుంభాభిషేకం జరిపి ఆలయాలకు పూర్వవైభవం కల్పిస్తామని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.దక్షిణ కైలాస క్షేత్రంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన పురాతన ఆలయాల కు మహర్దశ పట్టించే విధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూర తారక శ్రీనివాసులు వివిధ ప్రాంతాల్లోని అనుబంధ ఆలయాలకు మహా కుంభాభిషేకం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. వెయ్యి లింగాలకోన వద్ద వెలిసిన పురాణ ప్రసిద్ధమైన మార్కండేయ తీర్థం లోని మార్కండేయ ఆలయం ఆధునీకరణ జీర్ణోధారణ పనులు నిర్వహించడానికి బాలాలయ స్థాపన పూజలను చేపట్టారు. దుర్గమ్మ కొండ వద్ద వెలిసి ఉన్న ప్రసిద్ధమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి పురాతన ఆలయాన్ని ఆధునికరించి మహా కుంభాభిషేకం నిర్వహణకు బాలలాయ స్థాపన పూజలు చేపట్టారు.

ఈ టి సి కేంద్రంలోని నాటి కాళహస్తి రాజుల హయాంలో నిర్మించిన పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం జీర్ణ ధారణ పనులు కోసం బాలలాయ స్థాపన పూజలు ను చేపట్టారు. కైలాసగిరి కొండల్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ జీర్ణోధరణ ఆధునీకరణ పనులు కోసం బాలలాయం స్థాపన పూజలను చేపట్టారు.. ఆయా ఆలయాల్లో ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి హోమ పూజలను నిర్వహించి శాస్త్ర యుక్తంగా బాలలాయా స్థాపన పూజలు ను జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూర తారక శ్రీనివాసులు మాట్లాడుతూ పురాతనమైన ఆలయాలకు మహర్దశ పట్టించే విధంగా ఆధునీకరణ
జీర్ణో ధారణ పనులు చేపట్టడానికి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి,ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు చింతామణి పాండు, దేవస్థాన అర్చకులు రాంనగర్ గురుకుల్, శ్రీనివాసుని గురుకుల్, వేద పండితులు సంగమయ్య శాస్త్రి, శ్రీనివాస శర్మ, విష్ణుభట్ల శర్మ, పరిచారకులు, గోవింద్ శర్మ,తిరుమల శర్మ, రాకేష్ శర్మ, మారుతి శర్మ, చందు శర్మ, మరియు ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, పసల భార్గవ్, బాలా గౌడ్, సునీల్, ఇంజనీర్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Efforts to create Mahardasa for ancient temples – Srikalahasteeshwara Swami is the President of the Board of Trustees
