ఉత్పత్తి అయ్యే అన్నిరకాల ఎగుమతులను మన నౌకాశ్రయాల నుంచి పోయే విధంగా కృషి

Date:20/10/2020

–  ప్రాజెక్ట్ మేనేజర్ పారిశ్రామిక కారిడార్ జైదీప్ ముఖర్జీ

 

చిత్తూరు ముచ్చట్లు

రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ నుంచి చిత్తూరు జిల్లా వరకు పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని సద్వినియోగం చేసుకొని ఉత్పత్తి అయ్యే అన్నిరకాల ఎగుమతులను మన నౌకాశ్రయాల నుంచి పోయే విధంగా కృషి చేస్తుందని ఇందుకోసం  రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే ప్రధాన వస్తువులు అదేవిధంగా ఎగుమతి అయ్యే వాటి వివరాలను సేకరిస్తున్నామని ప్రాజెక్ట్ మేనేజర్ పారిశ్రామిక కారిడార్ జైదీప్ ముఖర్జీ అన్నారు. మంగళవారం నాడు ఉద్యానవన శాఖ కార్యాలయంలో చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు సంబంధించి ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా నుంచి ఎగుమతులు అయ్యే మామిడి గుజ్జు పరిశ్రమలు అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి గుజ్జు పరిశ్రమ ప్రతినిధి గోవర్ధన్ బాబి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం 12000 కంటైనర్ లకు పైగా మామిడి గుజ్జు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని జిల్లాలో ఉత్పత్తయ్యే మామిడి గూటిలో ఎక్కువభాగం అంటే సుమారు 85 శాతం మేర ఎగుమతులు అవుతాయని అదేవిధంగా జిల్లాలో బుజ్జి గా తయారు చేసే బొప్పాయి జామ టమోటా వంటి ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకు వెళ్తాయని దీనికి సంబంధించి మొత్తం ఉత్పత్తులను చెన్నై నుంచి ఇతర దేశాలకు పంపడం జరుగుతోందని అలా కాకుండా చిత్తూరు జిల్లాలో ఒక కంటైనర్ డిపో ఏర్పాటు చేస్తే ఇక్కడున్న కొంత మందికి ఉపాధి కలగడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఉపయోగపడే విధంగా ఉంటదని ఐసిడి నుంచి నేరుగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా ఎగుమతులు చేసుకోవచ్చునని అందుకు ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని చెప్పారు.

 

గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధి శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 పైచిలుకు గ్రానైట్ పరిశ్రమల నుంచి నెలకు 200 నుంచి 300 కంటైనర్ల ఫినిష్ గ్రానైట్ వెళుతుందని అదే విధంగా ఇతర దేశాలకు రా  బ్లాక్స్ కూడా వెళ్తాయని ఒక చిత్తూరు జిల్లా నుంచి యాభై నుంచి అరవై కోట్లు దాకా ప్రభుత్వానికి ఆదాయం చెల్లించడం జరుగుతుందని ఇదంతా తమిళనాడు ప్రభుత్వానికి వెళుతుందని అలాకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలి అంటే ఇక్కడ ఐసిడి ఏర్పాటు అవసరమని వారు అన్నారు. ఉద్యానవన శాఖ డిడి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలు దాదాపు 80 వరకు పరిశ్రమలు ఉన్నాయని వీటిలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు అయిన మామిడి టమోటా బొప్పాయి సపోటా జామ వంటి పండ్ల నుంచి తీసి ఇతర దేశాలకు పంపడం జరుగుతుందని అయితే ఇక్కడ పారిశ్రామిక వేత్తలు కోరినట్లుగా వైసీపీ ఏర్పాటు చేస్తే వారి వ్యాపార లావాదేవీలను ఇక్కడినుంచి జరుపుకోవచ్చు అని ఆలోచిస్తున్నారని అదేవిధంగా చిత్తూరు లేదా పాకాల రైల్వే స్టేషన్లకు సమీపంలో ఐ సి డి నీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని అన్నారు.

 

దానికి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ మేనేజర్ ముఖర్జీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు రాష్ట్రప్రభుత్వం సముఖంగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసిందని రాష్ట్రం నుంచి అనేక ఉత్పత్తులు ఇతర దేశాలకు వెళ్తున్నాయని వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం మన నౌకాశ్రయాల నుంచి వెళితే విదేశీ మారక ద్రవ్యం రావడంతోపాటు వాణిజ్య సంబంధాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారని అన్నారు. పరిశ్రమల శాఖ డిడి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు వచ్చినప్పుడు నిల్వ చేసుకునే సామర్థ్యం లేకుండా కొందరు ఆర్డర్లు వచ్చి సకాలంలో వారికి ఉత్పత్తులను పంప లేకపోవడంతో చాలా ఆర్డర్లు రద్దు అవుతున్నాయని దాంతో కంటైనర్ల డిపో వద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అలా కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్డర్ వచ్చిన వెంటనే ఉత్పత్తులను పంపడానికి వెంటనే వీలవుతుందని అన్నారు. సహాయ సంచాలకులు మైన్స్ అండ్ జియాలజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గ్రానైట్ ఎక్కువగా విదేశాలకు వెళ్తుందని ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి లేదా వైజాగ్ వెళ్లాల్సి వస్తోందని అలా కాకుండా కృష్ణపట్నం పోర్టు ద్వారా ఇతర దేశాలకు పంపాలంటే ఐసిడి ఉండాలని పలువురు కోరుతున్నట్లు చెప్పారు. ఇతర దేశాల నుంచి ఇప్పటికే జీడిమామిడి,పల్ప్ పరిశ్రమకు సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్స్ అన్ని ఇతర దేశాల నుంచి రావడం జరుగుతుందని అయితే ఐసీడీ ఉంటే చాలా వరకు వ్యయం ఆదా అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఈ సౌకర్యాన్ని వీలైనంత తొందరలో కల్పించేందుకు కృషి చేస్తామని అదేవిధంగా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సైతం ఈ విషయంలో చాలా ఆసక్తి చూపుతున్నారని ప్రతినిధి వెల్లడించారు . ఈ సమావేశంలో మరి కొందరు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కారిడార్ అభివృద్ధి కోసం వచ్చిన జైదీప్ ముఖర్జీని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు గ్రానైట్ పరిశ్రమల యజమానులు సన్మానించారు

ఎర్రచందనం పరిరక్షణ పై టాస్క్ ఫోర్స్ ఇంచార్జి డి ఐజీ  సమీక్ష

Tags:Efforts to divert all types of exports generated from our ports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *