అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరానికి కృషి – ఎంపీ మిధున్‌రెడ్డి
– పిల్లల సంక్షేమం చూస్తున్న సిబ్బందికి వందనం
పుంగనూరు ముచ్చట్లు:
అంగన్వాడీల సిబ్బంది సమస్యలు ఏమున్నా తెలియజేస్తే వాటిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదించి , సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి హామి ఇచ్చారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఐసిడిఎస్ పీడీ నాగశైలజ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది యూనిఫాంలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హాజరైయ్యారు. సభలో మిధున్‌రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది ఎంతో క్రమశిక్షణతో కేంద్రాల్లో చిన్నపిల్లల ఆరోగ్యము, రక్షణ, పోషణ నిర్వహించడం అభినందనీయమన్నారు. వారందరికి వందనాలని కొనియాడారు. ముఖ్యంగా అంగన్వాడి సిబ్బంది యూనిఫాంలు ధరించి రావడం అభినందనీయమన్నారు. అంగన్వాడీలను మరింతగా బలోపేతం చేసి, చిన్నారుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయడంలో అంగన్వాడి సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి స్వయంగా మెను తయారు చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను పీప్రైమరీ స్కూళ్లుగా మార్చడం చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు, ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు పని చేస్తున్న వైఎస్సార్సిపి ప్రభుత్వానికి మహిళల ఆశీస్సులు ఎల్లప్పుడు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలం, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చైర్మన్ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Efforts to solve the problems of Anganwadi staff – MP Midhunreddy