గుడ్డు గగ్గోలు 

Egg grogs

Egg grogs

Date:14/09/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. ఇతర రాష్ట్రాలకు కోడిగుడ్ల ఎగుమతులు తగ్గిపోవడం, ధర పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు కన్నా తక్కువకే విక్రయించాల్సి రావడంతో నష్టాల బారిన పడుతున్నారు. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మేత ధర, నిర్వహణ వ్యయాలు పెరిగినందున ఒక్కో గుడ్డు ధర రూ.3.80 ఉంటేనే గిట్టుబాటయ్యేది.
అలాంటిది ప్రస్తుతం దక్కుతున్నది రూ.3.22 మాత్రమే. ఈకారణంగా జిల్లాలో ఫౌల్ట్రీ రంగానికి గత రెండు నెలల్లో రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.   శ్రావణమాసం కావడంతో గుడ్డు వినియోగం తక్కువగా ఉండగా, మరో వారం రోజుల్లో వినాయక నవరాత్రులు రానుండటంతో మరింత ప్రభావం ఉంటుందని అంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 1.20 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వీటిలో 85 శాతం వరకు గుడ్లు పెడుతున్నాయి. స్థానిక   అవసరాలకు 35 శాతం వినియోగం అవుతుండగా, మిగతావి అసోం, పశ్చిమ బంగ, బిహార్‌, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో రోజుకు 145 లారీల గుడ్లు వరకు ఎగుమతి కాగా, ప్రస్తుతం 105 లారీలు మాత్రమే అవుతున్నట్లు ఫౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
బీ కోడిగుడ్డు ధర నిర్ణయాన్ని జాతీయ గుడ్ల సమన్వయ సంఘం నిర్ణయిస్తుంది. ఆ మేరకు ప్రస్తుతం రూ.3.31 ఉండగా.. కమీషన్‌, ఇతర ఖర్చులుపోను రైతుకు రూ3.22 అందుతోంది. రెండు నెలలుగా సగటు ధర రూ.3.50 కంటే తక్కువగా ఉంది.
ధర నిర్ణయంలో దళారుల పాత్ర అధికంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్లో డిమాండు, సఫ్లైను ఆసరాగా చేసుకొని ముందుగానే కొనుగోళ్లు తగ్గించి వేయడంతో ఆ ప్రభావం ధరపై పడింది. ఫారాల్లో గుడ్లు నిల్వలు పెరగడంతో మార్కెట్‌ ధర కంటే కొంతతక్కువ నిర్ణయించినా దాచుకునేందుకు శీతల గిడ్డంగులు లేనందున అయినకాడికే అమ్ముకోవాల్సి వస్తోందని కోళ్ల పెంపకందారులు వాపోతున్నారు.
Tags:Egg grogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *