అవయవదానం పునర్జన్మకు మరోప్రసాదం

Ehavadamana is another way to rebirth

Ehavadamana is another way to rebirth

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:21/07/2018

పుంగనూరుముచ్చట్లు:

సమాజంలో ఎన్నో విధాలుగా బాధపడుతున్న రోగులకు అవయవదానాలు చేసి పునర్జన్మను ప్రసాదించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో అవయదానాలపై అవగాహన సదస్సును మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్రతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎంతో మంది సరైన చికిత్సలు లేక, అవయవాలు దొరక్క ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన అవయవదానాలు చేసి, పునర్జన్మను ప్రసాధించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల భారిన పడి బ్రైన్‌డెడ్‌తో బాధపడుతున్న వారు సహృదయంతో అవయవాలను దానం చేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండ రక్తదానం చేయాలని, అదే విధంగా నేత్రదానం కూడ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ త్యాగరాజు, మెప్మా సిటి మేనేజర్‌ మధుసూధన్‌రెడ్డి, కమ్యూనిటి ఆర్గనైజర్లు జయంతి, సాధికార మిత్రలు, ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆర్పిలు, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

ఇంటింటా చెత్త సేకరణపైఅవగాహన….

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లోను ఇంటింటా చెత్త సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటా చెత్త సేకరణపై ఆయన మున్సిపల్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, దానిని గృహ యజమానులు మున్సిపల్‌ కార్మికులకు అందజేయాలన్నారు. రోడ్లపైన, కాలువల్లోను చెత్తను పడవేయరాదని సూచించారు. పారిశుద్ద్యాన్ని మెరుగుపరుస్తూ , స్వచ్చ పుంగనూరుగా మార్చుకునేందుకు ప్రజలందరు సహకరించి, పారిశుద్ధ్య కార్యక్రమాలలో బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు మున్సిపల్‌ కంపోస్ట్ యార్డులకు తరలిస్తున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు వినియోగాన్ని పూర్తిగా ఆపి వేసి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం ప్లాస్టిక్‌ ద్వారా దెబ్బతినకుండ చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , సిబ్బంది పాల్గొన్నారు.

 

అవయవదానం పునర్జన్మకు మరోప్రసాదంhttps://www.telugumuchatlu.com/ehavadamana-is-another-way-to-rebirth/

Tags: Ehavadamana is another way to rebirth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *