Natyam ad

టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో ఎనిమిదిమంది అరెస్టు

గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీడీపీ నేత చంద్రయ్య హత్యకేసులో ఎనిమిదిమంది నిందితులను పోలీసులు ఆరెస్టుచేసారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పి విశాల్ గున్ని కేసు వివరాలు మీడియాకు తెలిపారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో నిన్న ఉదయం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు తోట చంద్రయ్య ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. గురువాంరం ఉదయం సుమారు 7 గంటల సమయంలో తోట. చంద్రయ్య  ద్విచక్రవాహనంపై బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా చింతా.శివరామయ్య మరియు 7గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరరావడం జరిగినది.  తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.  హత్య సమాచారం అందిన వెంటనే మాచర్ల రూరల్ సీఐ, వెల్దుర్తి ఇంచార్జి ఎస్సైలు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని, ఘటన జరిగిన స్థలంలో లభించిన అన్ని ఆధారాలను సేకరించి, తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తగిన చర్యలు తీసుకోకున్నారు.  మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు మొత్తం 8 మంది నిందితులపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ముమ్మర గాలింపు చేపట్టారు.  ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని పోలీసుల  ప్రాధమిక దర్యాఫ్తులో తెలిందని అన్నారు.  మృతుడు తోట చంద్రయ్య మరియు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే ప్రాంతంలో నివసిస్తుంటారు. వారు ఒకే కులం, సామాజిక వర్గానికి చెందిన వారు.

 
 

 3 సంవత్సరాల క్రితం మృతుడు తోట చంద్రయ్య. నిందితుడు చింతా శివ రామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో మధ్య గొడవలు జరిగాయని, అప్పటినుండి వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అయన అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల కుమార్తె ఓణీల కార్యక్రమము జరుగగా ఆ గ్రామానికి హాజరైన బంధువులతో తోట చంద్రయ్య, చింతా శివరామయ్యను చంపుతానని చెప్పగా ఆ విషయం చింత శివరామయ్యకు తెలిసింది. అతని చంపడానికంటే ముందే నేనే అతన్ని చంపాలని శివరామయ్య, తన కుమారుడు, మరో ఆరుమంది అనుచరుల సహాయంతో చంద్రయ్యను  హత్య చేసారు.  పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసారని మా దర్యాఫ్తులో తేలింది.  24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశాం,నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Eight arrested in TDP leader Chandraya murder case