Peeke who erred in unlocking the center

కొత్తగా మరో ఎనిమిది పాజిటివ్‌

-అన్నీ విజయవాడ నగర పరిధిలోనే

Date:30/05/2020

విజయవాడ  ముచ్చట్లు:

నగరంలో కరోనా కేసుల ఉద్ధృతి ఆగడం లేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకూ జిల్లాలో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులూ విజయవాడ నగరంలోనే వెలుగుచూశాయి. ప్రధానంగా కృష్ణలంక, వన్‌టౌన్‌ ప్రాంతాల్లోనే ప్రస్తుతం వస్తున్న కేసులు అధికంగా ఉంటున్నాయి. తాజాగా నమోదైన ఎనిమిది పాజిటివ్‌ కేసుల్లో ఆరు ఈ రెండు ప్రాంతాల్లోనే వచ్చాయి. వీటిలో కృష్ణలంకలో మూడు పాజిటివ్‌ కేసులొచ్చాయి. వీరికి ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనేది తెలియదు.  వన్‌టౌన్‌లోని వించిపేట నిజాంగేట్‌ ప్రాంతంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. చిట్టినగర్‌లో మరో వృద్ధుడు సైతం వైరస్‌ బారిన పడ్డారు. విజయవాడలోని ఊర్మిళానగర్‌లో 60ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది. సౌదీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి సైతం పాజిటివ్‌ వచ్చింది. ఈయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

 

కృష్ణా జిల్లాలో కొత్తగా వచ్చిన వాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 455కు చేరింది. ఇప్పటివరకూ జిల్లాలో 17మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు. మిగిలిన వారిలో కొందరు ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్ఛార్జి అవ్వగా.. మిగతా వాళ్లు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో నమోదైన మొత్తం కేసుల్లో విజయవాడ నగరంలోనే 368 పాజిటివ్‌లు ఉన్నాయి. ప్రధానంగా విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలోనే 142 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో విజయవాడలోని కార్మికనగర్‌ ఉంది. ఇక్కడ 52 పాజిటివ్‌ కేసులు ఇప్పటివరకూ వచ్చాయి. విజయవాడలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో 23, చిట్టినగర్‌, కె.ఎల్‌.రావు నగర్‌ల్లో 19, కుమ్మరిపాలెం, గుప్తాసెంటర్‌ సహా విద్యాధరపురంలో 16, ఖుద్దూస్‌నగర్‌, కేదారేశ్వరపేట, ఆయోద్యనగర్‌లో 14, కొత్తపేట, వన్‌టౌన్‌, మల్లికార్జునపేట, ఇస్లాంపేట, పంజాసెంటర్‌లో 13, వించిపేటలో 9, మధురానగర్‌లో 8, గొల్లపాలెం 8, సీతారాంపురం, గిరిపురం ప్రాంతాల్లో 7, హెచ్‌.బి.కాలనీ, ప్రియదర్శనినగర్‌ 6, సీతన్నపేట 5, గాంధీనగర్‌ 4, మొగల్రాజపురం 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా విజయవాడలోని మరో 22 ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు వరకూ కేసులు నమోదయ్యాయి.

ఆరుగురు పోలీసులపై వేటు

 

Tags: Eight other positives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *