బుల్లితెరపై బాలు సంచలనం

Date:25/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఆ పాట మధురం.. ఆ గానం అమృతం.. ఏ భాష చూసుకున్నా.. ఇంపైన పాటలు ఓ మూడు వినాలనిపిస్తే.. ఆ మూడింట రెండు గాన గాంధర్వుడు ఎస్పీ బాలు పాటలే ఉంటాయి. ఆయన పాటటమే
కాదు.. పాటలోని మాధుర్యాన్ని ప్రేక్షకులకు పంచడంలో ఎంతోమంది వర్థమాన గాయకుల్ని ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు. ఉష , కౌసల్య , గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్,
సందీప్, హేమచంద్ర, కారుణ్య ఇలా ఎందరెందరితో వందలాది పాటలు పాడించిన ఖ్యాతి, ఘనత ఎస్పీ బాలుకే దక్కింది.వేలాది పాటలతో వెండి తెరకే కాదు.. ఎన్నో ఏళ్లుగా ‘పాడుతా తియ్యగా’ అంటూ
బుల్లితెరకు కూడా ఎంతో దగ్గరయ్యారు బాలు. వేల పాటలతో ఎందరో సంగీత ప్రియుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం.. బుల్లితెర ప్రేక్షకుల సాక్షిగా ఎందరో సింగర్స్‌కి లైఫ్
ఇచ్చారు. ఈటీవిలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. 2016 వరకూ నిర్వరామంగా ప్రసారమై.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా
సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్,
ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు.ఈ ‘పాడుతా తీయగా’
కార్యక్రమంతో ఎంతో మంది చిన్నారులను సింగర్స్‌గా తీర్చిదిద్దారు బాలు. తెలుగు సంగీతాభిమానులను అలరించిన ఈ షో… విదేశాల్లో తెలుగు మమకారాన్ని రుచి చూపించిన రోజులున్నాయి.
ప్రత్యేకంగా అమెరికా వంటి దేశాల్లో ఈ ప్రాగ్రామ్ నిర్వహించారంటే.. దాని గొప్పతనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలు అంటే పాడుతా తియగా.. పాడుతా తియగా అంటే బాలు అన్నట్లుగా
ప్రేక్షకుల మనసుని దోచింది ఈ షో. మొత్తానికీ బాలు లేని లోటు సంగీత ప్రపంచానికి తీరని లోటనే చెప్పుకోవాలి. ఇలాంటి షో చేయడం ఎస్పీ బాలుకి మాత్రమే చెల్లింది.

 

పాటలు బాలుతో చిన్నప్పటి నుంచే పరిచయం

Tags:El chico sensación en la televisión

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *