శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు
– యాత్రికుల కోసం అన్నప్రసాదం మరియు తాగునీరు సౌకర్యాలు
– కుమారధార తీర్థ ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు
తిరుమల ముచ్చట్లు:

మార్చి 7న తిరుమల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.భక్తులను ఉదయం 6 గంటల నుండి తీర్థానికి అనుమతిస్తారు. కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు డ్యాం వద్ద అన్నప్రసాదం మరియు తాగు నీరు అందిస్తారు. వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తారు.భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు కుమారధార తీర్థం వరకు దాదాపు 300 మంది విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది కేటాయించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు మరియు వృద్ధులు ట్రెక్కింగ్ చేయ వద్దని మనవి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుండి కుమారధార తీర్థ ప్రవేశం మార్గం మూసివేయబడుతుంది. కావున భక్తులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని తమ కుమారధార తీర్థ ముక్కోటి యాత్రను అలప్రదం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష
టీటీడీ ఈఓ ఏవి.ధర్మా రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 7, మంగళవారం జరగనున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సోమవారం ఉదయం పి.ఏ.సి-4 లోని మీటింగ్ హాల్‌లో అన్ని విభాగాల అధికారులతో తిరుమల విజివోలు బాలిరెడ్డి, గిరిధర్, తిరుమల డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Tags: Elaborate arrangements for Sri Kumaradhara Tirtha Mukkoti
