పొత్తులతో ఎల్ రమణ సీటుకే ఎసరు

Elam Rama is the seat of alliances
Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పట్ల తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని స్పష్టం అయిపోయింది. తెలుగుదేశం ఆవిర్భావం జరిగిందే కాంగ్రెస్ వ్యతిరేకత పునాది మీద. అయితే ఇప్పుడు కాంగ్రెస్,టీడీపీలు చేతులు కలుపుతున్నాయి.
ఈ విషయంలో విమర్శలు వస్తున్నా.. ఈ రెండు పార్టీలూ రాజకీయ అవసరాల మేరకు చేతులు కలపబోతున్నాయని స్పష్టం అవుతోంది. ఇప్పటికే సీట్ల ఒప్పందం వరకూ వచ్చింది వీరి పొత్తు. తెలుగుదేశం పార్టీ ముప్పై సీట్ల వరకూ అడుగుతోందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు పదిహేను నుంచి ఇరవై సీట్లకు ఓకే అంటున్నారని..
తుది నిర్ణయం ఖరారు కావాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయితే.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా సీటును కోల్పోతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశారు రమణ. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో రమణ ఓటమి పాలయ్యారు. ఈ విధంగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆ సీటును తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరిస్తోందని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న సీటును వదులు కోలేమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారట. దీంతో తెలుగుదేశం పార్టీ వెనక్కు తగ్గుతోందని, రమణకు మరో సీటును కేటాయించడానికి చంద్రబాబు హామీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
కూకట్ పల్లి లేదా జూబ్లీహిల్స్ వంటి చోట రమణ పోటీకి చంద్రబాబు నాయుడు సీటు కేటాయించనున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Tags: Elam Rama is the seat of alliances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *