హింస రాజకీయాలకు పాల్పడేది ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లింగోజిగూడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:
ఎల్బీనగర్ లో హింస రాజకీయాలను ప్రోత్సహించేది, పాలుపడేది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని లింగోజిగూడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కానీ విలువలు కానీ సుధీర్ రెడ్డి కి లేవని హింస గురించి సుధీర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హింస రాజకీయాలకు పాల్పడేది ఎవరు అనేది ఎల్బినగర్ ప్రజలకు బాగా తెలుసని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి పదవుల కోసం,డబ్బుల కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరి అనైతిక విలువలకు పాల్పడ్డారని అన్నారు. అధికారంలో ఉన్న మీరు  కరోనా బాధితులు పట్టించుకోకుండా రేమిడేసివర్  కూడా అందుబాటులో  లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన మీరు రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధర్పల్లి అన్నారు.  అధికారంలో ఉన్నది మీర కాంగ్రెస్ పార్టీ నా అని ఆయన ఎద్దేవా చేశారు.  రానున్న రోజుల్లో ఎల్బీనగర్ ప్రజలు ఆయనకు సరైన బుద్ధి చెబుతారని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Elbinagar MLA Sudhir Reddy is the perpetrator of violent politics
Lingojiguda Congress Party Corporator Daripalli Rajasekhar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *