పఠాన్ చేరు లో వృద్ధ దంపతుల అత్మహత్య

Date:24/04/2018
సంగారెడ్డి  ముచ్చట్లు:
ఒకే తాడుపై వృద్ధ దంపతుల కలిసి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది.  సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం ఇస్నాపూర్ క్రాస్  రోడ్ లో నివాసము ఉండే వృద్ధ దంపతులు రమణయ్య(65), సరస్వతి(60) లు  స్థానికంగా నివాసం ఉంటు పిండి గిర్ని నడుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ ఉండడంతో ఇద్దరే ఇంటి పట్టున ఉంటున్నారు. మరి ఏమైందో తెలియదు, మంగళవారం ఉదయం దంపతులిద్దరూ ఒకే తాడుతో వేలాడు కనపడ్డారు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంధులు లేవని బంధువులు అంటున్నారు.  సంఘటన తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. హటాత్తుగా  వీళ్లు ఆత్మ హత్య చేసుకోవటం కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. తీర్థ యాత్రలకు వెళ్దామని అనుకున్న వారు అకస్మాత్తుగా ఆత్న హత్య చేసుకోవడం ఏంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Tags:Elder couple’s suicide is at Pathan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *