ఎలక్ట్రానిక్ హబ్ గా ఏపీ : మంత్రి నారా లోకేష్ 

Elected as an electronic hub: Minister Nara Lokesh

Elected as an electronic hub: Minister Nara Lokesh

Date:26/02/2018
విశాఖపట్నం  ముచ్చట్లు:
నగరంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు చివరిరోజు సోమవారం ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల అధినేతలు,సిఈఓ లతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి అనేక చర్యలు తీసుకున్నాం.అనేక పాలసీలు,రాయితీలు కల్పిస్తున్నామని అన్నారు. కంపెనీలు త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు అనుమతులు,భూములు వేగంగా కేటాయిస్తున్నాం. రాష్ట విభజన సమయంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఇక్కడ తయారు కాలేదు. ప్రస్తుతం దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయని అన్నారు. రిలయన్స్ రాక తో ఈ సంఖ్య 5 కాబోతుంది . కానీ దేశంలో తయారు అయ్యే పది ఫోన్లలో 8 ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే లా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు టార్గెట్ ఇచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్ మోడల్ ను అభివృద్ధి చేస్తున్నాం. చిప్ డిజైన్, బ్యాటరీ తయారీ దగ్గర నుండి పూర్తి స్థాయి వస్తువుల తయారీ ఆంధ్రప్రదేశ్ లో జరిగేలా పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
Tags: Elected as an electronic hub: Minister Nara Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *