Natyam ad

ముక్తాపురంలో ఎన్నికల ప్రచారం

అనంతపురము  ముచ్చట్లు:


1) 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శింగనమల నియోజక వర్గ వై.యస్.ఆర్.సి.పి ఎమ్మెల్యే అభ్యర్థి   యం.వీరాంజనేయులు   ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం ముక్తాపురం గ్రామము నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్   బోయ గిరిజమ్మ  , అనంతపురము వై.యస్.ఆర్.సి.పి యంపి అభ్యర్థి   మాలగుండ్ల శంకర్ నారాయణ   పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  , అనంతపురము వై.యస్.ఆర్.సి.పి యంపి అభ్యర్థి   మాలగుండ్ల శంకర్ నారాయణ   మరియు   యం.వీరాంజనేయులు తో పాటు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ,

 

 

ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగాలంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలందరూ 2024 ఎన్నికలలో వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వానికి అండగా నిలిచి,   యం.వీరాంజనేయులు ని ఎమ్మెల్యే గా,  మాలగుండ్ల శంకర్ నారాయణ ని యంపి గా గెలిపించి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము వై.యస్.ఆర్.సి.పి జిల్లా అధ్యక్షులు, స్థానిక జడ్.పి.టి.సి, యం.పి.టి.సి, సర్పంచు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Election campaign in Muktapuram

Post Midle