Natyam ad

ఉరవకొండలో ఎన్నికల ప్రచారంలో రోడ్డు షో

ఉరవకొండ ముచ్చట్లు:

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి   వై.విశ్వేశ్వర రెడ్డి  ఆధ్వర్యంలో వజ్రకరూర్ మండలం కొనకొండ్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమములో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ , పేదల పక్షాన పోరాడుతున్న జగన్ మెహన్ రెడ్డికి అండగా నిలవాలని ప్రజలను కోరారు..అనంతరం  వై.విశ్వేశ్వర రెడ్డి తో పాటు గడప గడప తిరుగుతూ రానున్న రోజుల్లో ప్రజలందరూ వై.యస్.ఆర్.సి.పికి మద్దతుగా నిలిచి, సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగేందుకు మళ్లీ  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురము పార్లమెంట్ సమన్వయకర్త  మాలగుండ్ల శంకర్ నారాయణ , వై.యస్.ఆర్.సి.పి అనంతపురము జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక జడ్.పి.టి.సి లు, యం.పి.పి లు, వైస్ యం.పి.పి లు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తన ప్రజలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Election campaign road show in Uravakonda

Post Midle