ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు

Election Code of Conduct is strongly enforced

Election Code of Conduct is strongly enforced

నగరం లో బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించిన బల్దియా
Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటుచేసిన బ్యానర్లు ఫ్లెక్సీలు హార్డీoగ్ లను  జిహెచ్ఎంసి తొలగించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువడటంతో నగరంలో పబ్లిక్ డీఫెస్స్మెంట్  చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుండి హైదరాబాద్ నగరంలో వివిధ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటుచేసిన ప్రచార సామాగ్రిని తొలగించడంలో నిమగ్నమయ్యారు ముఖ్యంగా  ప్రభుత్వ పథకాలపై ఏర్పాటుచేసిన భారీ హోర్డింగులు ఫ్లెక్సీలు లను కూడా జిహెచ్ఎంసి సిబ్బంది తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిబ్బంది కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
జిహెచ్ఎంసి కి చెందిన 18 వేల మంది పారిశుధ్య. డిజాస్టర్  సిబ్బంది, గత రాత్రి నుండి దాదాపు 10 వాహనాలకు పైగా చిరు ఇతర ప్రచార సామగ్రిని తొలగించారని జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించారు. నగరంలోని అన్ని గాల్లో గోడలపై విద్యుత్ స్తంభాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫెక్సీలను దాదాపు 80 శాతానికి పైగా తొలగించామని, ఈ తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ప్రకటించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటి భవనాలపై ఉన్న ప్రభుత్వ పథకాలను తెలియజేసే వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత శాఖల కు తెలియజేశామని తెలిపారు. నగరంలో అడ్వటైజ్మెంట్ ఏజెన్సీలను తమ  హోర్డింగ్ల పై వివిధ పార్టీలు,  నాయకులు, ప్రభుత్వ పథకాల కు చెందిన ప్రకటన లన్నింటిని వెంటనే తొలగించు కోవాల్సింది గా ఆదేశాలు జారీ చేశామని దాన కిషోర్ స్పష్టం చేశారు. నగర వాసులు తమ నివాసాలపై వివిధ పార్టీల  బ్యానర్లు పతాకాలు ఇతర ప్రచార సామగ్రిని తొలగించుకోవాలని పేర్కొన్నారు.
Tags:Election Code of Conduct is strongly enforced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *