– మండిపడుతున్న నాయకులు, ఉద్యోగులు
Date:23/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలుగుదేశం పార్టీ తొత్తుల వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్దతిలో అత్యధిక మెజార్టీసాధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషన్‌ను తొత్తులా వినియోగించుకుంటున్నారని ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు , అధికారులు మండిపడుతున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఉద్యోగుల ప్రాణాలకు ఇబ్బంది కలగకుండ వ్యాక్సినేషన్ కొనసాగే సమయంలో ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించడం ఉద్యోగుల ప్రాణాలతో చలగాటమాడినట్లేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబు ఏజెంటుగా నిమ్మగడ్డ….
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చంద్రబాబునాయుడు ఏజెంటుగా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ అనే విషయాన్ని మరచి , ప్రభుత్వాధినేత పాలన చేస్తామంటే చూస్తూ ఊరుకోం . తగిన గుణపాఠం నేర్పుతాంజాగ్రత్త.
– అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పుంగనూరు.
నిమ్మగడ్డ ఎన్నికల్లో పోటీ చేయాలి…
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన విధులను నిర్వర్తించకుండ ర్ఖా•న్ని పరిపాలన చేయాలంటే తెలుగుదేశం పార్టీ టికెట్టు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలి. అలా కాకుండ రాజ్యాంగ పదవిలో ఉంటు అధికారాన్ని దుర్వినియోగం చేసి, , ఉద్యోగులు, ప్రజల ప్రాణాలతో చలగాటమాడితే తగిన శాస్తీ చేస్తాం.
-ఫకృద్ధిన్‌షరీఫ్, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు , పుంగనూరు.
ఉద్యోగుల ప్రాణాలతో చలగాటమే….
ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు రాష్ట్రంలోని ఉద్యోగుల ప్రాణాలతో చలగాటమాడినట్లే. కోవిడ్ వ్యాక్సినేషన్ 60 రోజుల గడువులో రెండు సార్లు వేయించుకోవాలని ప్రధానమంత్రి సూచించిన ఎన్నికల కమిషన్ ఇందుకు విరుద్ధంగా ఎన్నికల షెడ్యూల్డ్ ఇవ్వడం, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దురదృష్టకరం. ఎన్నికల కమిషన్ భయపెట్టి ఉద్యోగాలు చేయించలేందని, ఈ విషయంలో ఎన్నికలు వాయిదా వేయాలని, లేకపోతే తాము ఎన్నికలకు సహకరించేది లేదని తెలిపారు.
– జి.వరదారెడ్డి, ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు , పుంగనూరు.
ఎన్నికలు వాయిదా వేస్తే కొంపలు మునిగిపోదు….
రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేస్తే కొంపలేం మునిగిపోదు. ఎన్నికల పక్రియలో ఉదయం నుంచి రాత్రి దాక పని చేయాల్సి ఉంది. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే. ఓటర్లు ఓటు వేసి వెళ్తారు. ఈ సమయంలో ఉద్యోగులకు కరోనా సోకితే వారి కుటుంబాలకు ఆదుకునేది ఎవరు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేపట్టడంతో మాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్డ్‌ను ఈసీ ప్రకటించడం ఉద్యోగులు, వారి కుటుంబాలతో చలగాటమాడటమే. ఎన్నికల కమిషన్ పక్రియకు మేము సహకరించేది లేదు. వ్యాక్సినేషన్ పూర్తి కాగానే ఆదేశాలు పాటిస్తాం.
– కెఎల్.వర్మ. కమిషనర్, ఏపి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Election Commission