ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్ పోల్ సర్వే 2024

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్ పోల్ సర్వే 2024.గత 5సంవత్సరాలుగా YSRCP ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు చేసినటువంటి అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి 679 మండలాలు,17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు,30 నగర పంచాయతీలు అన్నింటిని కవర్ చేస్తూ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొన్న భీమిలి,దెందులూరు,రాప్తాడు,బాపట్ల సిద్ధం సభలతో పాటుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రతో 22రోజుల పాటు 2100కిలోమీటర్లు ప్రయాణించి 23జిల్లాలు కవర్ చేస్తూ 16సభలతో పాటు భారీ జనంతో 9రోడ్ షోల్లో పాల్గొన్న & 6చోట్ల స్పెషల్ ఇంటరాక్షన్ మరియు 500 చోట్ల డైరెక్ట్ పబ్లిక్ ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రజలతో పాటుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రజల అభిప్రాయం ఆధారంగా మా టీం చేసినటువంటి సర్వే ఇది.

ముఖ్యమైన అంశాలు:-

*ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసినటువంటి
అమ్మఒడి,విలేజ్ హెల్త్ క్లినిక్స్ ,రైతు భరోసా కేంద్రాలు,మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు, గడప వద్దకే పెన్షన్లతో పాటుగా ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి  మీద మహిళలు,రైతులు,వృద్ధుల్లో గట్టి నమ్మకాన్ని నిలబెట్టాయి

*గత 5సంవత్సరాల్లో YSRCP ప్రభుత్వం నామినేటెడ్ పదవులతో
పాటుగా, నామినేటెడ్ పనుల్లో మరియు చట్ట సభల్లో & పార్టీ పదవుల్లో తీసుకున్న సామజిక వర్గాల సమీకరణలతో పాటు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం ద్వారా భారీగా కలిసి రానున్న SC,ST,BC,MINORITY వర్గాల ఓటు బ్యాంకు.

*కుప్పం,మంగళగిరి,పిఠాపురం,
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో YSRCP అభ్యర్థుల గెలుపు దిశగా ప్రజల తీర్పు ఉండబోతుంది.

*రాష్ట్రంలో దాదాపుగా 60% మహిళలు YSRCP కి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారు.

*సీఎం జగన్ మోహన్ రెడ్డి  పేద ప్రజలకు గడప గడపకు అందించిన సంక్షేమ పథకాలే తిరిగి YSRCP అధికారంలోకి రావడానికి దోహదపడుతున్నాయి.

*కూటమిని పట్టించుకోని AP ప్రజలు

*గత ఎన్నికల కంటే భారీ ఓటు షేర్ తో అధికారంలోకి YSRCP

*నాడు – నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలు,ఆస్పత్రుల్లో చేపట్టిన సంస్కరణలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

*ప్రజల వద్దకే పాలన పేరుతో వాలంటీరు సేవలు,గ్రామా/వార్డు సచివాలయలు ప్రజలను ప్రభుత్వానికి దగ్గరగా చేసాయి.

*అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఏర్పాటు చేసిన మూడు రాజధానుల అంశం ప్రజలలో దృఢమైన నమ్మకాన్ని కలిగించడంతో పాటు తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డాయి.

*గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పూర్తిగా YSRCP వైపే మొగ్గు

*రాయలసీమ,ఉత్తారాంధ్ర,కోస్తాంధ్ర
ప్రాంతాల్లో పూర్తిగా పట్టు సాధించిన YSRCP

*కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం పట్ల అండగా నిలిచిన జగన్ కి మా మద్దతు అంటున్న ఏపీ ప్రజలు

*గత 5సంవత్సరాలుగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్  తిరిగి ముఖ్యమంత్రి కావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం అని గుర్తించి ఓటు రూపంలో జగన్ కి పూర్తి మద్దతు తెలిపిన మూడు ప్రాంతాల ప్రజలు.

*కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రతిపక్షానికి ప్రజల్లో ప్రతికూల అంశంగా మారింది.

*కూటమికి ప్రజల్లో పెద్దగా కలిసిరాని సూపర్ సిక్స్ పథకాల స్కీమ్స్

*BJP తో పొత్తుతో కూటమికి మైనారిటీ ఓటర్లు దూరం.

*ప్రజల్లో నమ్మకం కలిగించని కూటమి మేనిఫెస్టో

నోట్:-మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అని పిలుపునిచ్చిన YS జగన్ మోహన్ రెడ్డి  ఒకే ఒక్క మాట ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించడంతో పాటుYSRCP తిరిగి అధికారంలోకి రావడానికి దోహదపడుతున్నాయి.

 

Tags:Election Exit Poll Survey 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *