ఎన్నికల వ్యయం సవరింపు 

Date:20/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు

 

5 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు 30 లక్షలు వ్యయంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని సవరించింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు రూ.30.80 లక్షలను ఎన్నికల వ్యయంగా నిర్ణయిస్తూ, కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, గోవా, సిక్కింలతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, లోక్సభ స్థానాలకు రూ. 59.40లక్షలు, అసెంబ్లీ స్థానాలకు (ఉన్నచోట) రూ.22 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది.  దిల్లీలో లోక్సభ ఎన్నికలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. 30.80 లక్షలుగా ఖరారు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961ను సవరించినట్లు పేర్కొంది.ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది.ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లోక్సభకు రూ. 70 లక్షలు, రూ. 54 లక్షలు. అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలు రూ.20 లక్షల మేరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది.

బెట్టింగ్ రాయుళ్లు ఆరెస్టు

Tags:Election Expenditure Adjustment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *