Election heat in winter

 చలికాలంలో ఎన్నికల వేడివేడి

Date:27/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు

చలికాలంలోనూ హైదరాబాద్‌ నగరం ఎన్నికల వేడితో గరంగరంగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల పర్వం ముగిసి అభ్యర్థులెవరో కూడా తేలడంతో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు గ్రేట్‌ ఫైట్‌గా మారనున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ దూకుడును అడ్డుకుంటామన్న ధీమాతో కమలనాథులు రం గంలోకి దిగడం, కాంగ్రెస్‌ కూడా తనకు అనుకూలంగా ఉన్న చోట్ల ప్రభావం చూపేందుకు వ్యూహాలు రచిస్తుండటం, తనకు మంచి పట్టు న్న స్థానాల్లో ఎంఐఎం ఎప్పటిలాగే దూసుకెళుతుండడం, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అక్కడక్కడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రేటర్‌ పోరు రసవత్తరం కానుంది. ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద బాధితులకు పరిహారం పంపిణీతో మొదలైన ఈ ఎన్నికల వేడి టీఆర్‌ఎస్‌ సెంచరీ ధీమా, బీజేపీ భాగ్యలక్ష్మి ఆలయం ట్విస్ట్, కాంగ్రెస్‌ ఆరోపణలు, ఎంఐఎం నేతల ఆసక్తికర వ్యాఖ్యల నేపథ్యంలో మరింత రగులుకుంటోంది. తాము గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచినా ఈసారి సెంచరీ కొడతామని, పాతబస్తీలోని 10–12 స్థానాల్లో ఎంఐఎంను కూడా ఓడిస్తామని, విశ్వ నగరం కావాలో, విద్వేష నగరం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవేడిని మరింత పెంచుతున్నాయి. దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎంను సవాల్‌ చేస్తూ కమలనాథుల్లో ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమవుతోంది.ఈ రెండు పార్టీ లు ఒకటేనని, ఎంఐఎంతో కలిసి ముగ్గురూ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామే కనుక తమను ఆదరించాలని కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీలు, అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం జీహెచ్‌ఎంసీ ఎన్నికల క్షేత్రాన్ని హాట్‌హాట్‌గా మారుస్తోంది.

 

 ఖరీఫ్ తో పాటు రబీకి కళకళ

Tags:Election heat in winter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *