వైయస్సార్సీపి తుగ్గలి మండల కన్వీనర్ గా జిట్టా నాగేష్ ఎన్నిక
తుగ్గలి ముచ్చట్లు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుగ్గలి మండల కన్వీనర్ గా జిట్టా నాగేష్ ను మండల వైసీపీ నాయకులు మరోమారు ఎన్నుకున్నారు. శుక్రవారం రోజున పత్తికొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదేశాల మేరకు మండల వైసీపీ నాయకులు ఎన్నికను నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ జిట్టా నాగేష్ మాట్లాడుతూ వైయస్సార్ సిపి పార్టీ తుగ్గలి మండల కన్వీనర్ గా మరోసారి తనను ఎన్నుకున్నందుకు మండల వైసీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ గా ఎన్నికైన జిట్టా నాగేష్ ను మండల వైసిపి నాయకులు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి,తుగ్గలి మోహన్ రెడ్డి,రాతన మోహన్ రెడ్డి,మామిళ్ళ కుంట హనుమంత రెడ్డి, బసిరెడ్డి,శభాష్ పురం హనుమంతు,మారెళ్ళ సుధాకర్ రెడ్డి,సత్యప్ప,రాంపురం గంగాధర్, మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్,విద్యా కమిటీ చైర్మన్ గుంత రఘు తదితర మండల వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: Election of Jitta Nagesh as YSRCP Tuggali Mandal Convenor