బివిపి జిల్లా ప్రముఖ్ గా సందు యాదగిరి ఎన్నిక

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

ఢిల్లీలో ఈ నెల 7న ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఏర్పడిందని అందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లాకు సందు యాదగిరిని జిల్లా ప్రముఖ్ గా ఎంపిక చేసినట్లు విభాగ్ ప్రముఖ్ కర్నె రాంచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సందు యాదగిరి 1995 నుండి విద్యార్థి పరిషత్ లో కార్యకర్తగా పని చేస్తున్నార ని గతంలో పాలెం డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ గా, హాస్టల్స్ ఇంచార్జీ గా, నాగర్ కర్నూల్ బాగ్ ప్రముఖ్ గా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విస్తారక్ గా,వనపర్తి జిల్లా వ్యవస్థా ప్రముఖ్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేస్తూ విద్యారంగా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రముఖ్ గా ఎన్నికైన సందు యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రముఖ్ గా నియమించి నందు కు రాష్ట్ర నాయకత్వానికి, విభాగ్ ప్రముఖ్ కర్నె రాంచందర్ కు మరియు జిల్లా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నిరంతరం విద్యార్థులకు తోడుగా నిలుస్తూ జిల్లాలో ఏబివిపి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Tags: Election of Sandhu Yadagiri as BVP district leader

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *