5 వేల మందితో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్ – దానకిషోర్

Date:16/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 శాసన సభ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్ ను  5వేల మందిచే వెబ్ కాస్టింగ్ చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఈ వెబ్ కాస్టింగ్ లో  పాల్గొనడానికి ఆసక్తి కనబరిచే అభ్యర్థులు ముఖ్యంగా సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు జీహెచ్ ఎంసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ అధికారులు ఇంజనీరింగ్ కళాశాలలను సంప్రదిస్తున్నారని చెప్పారు. సొంత ల్యాప్ టాప్ కలిగిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొనే వారికి తగు పారితోషికం ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్ జారీచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 63099 20631, 63099 81289 నెంబర్లను సంప్రదించాలని దానకిషోర్ తెలియజేశారు.
Tags; Election process web casting with 5,000 people – Danakishor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *