ఎన్నికల సంస్కర్త టీఎన్ శేషన్ కన్నుమూత

Election reformer TN Sheeshan passed away

Election reformer TN Sheeshan passed away

Date:11/11/2109

తిరువనంతపురం ముచ్చట్లు:

ఎన్నికల సంస్కర్త గా ప్రసిద్ధి పొందిన కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ (87) గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. కేరళ లోని పాలక్కాడ్ జిల్లా లో 1932లో జన్మించిన శేషన్ .. తాను పుట్టిన ఊరి లోనూ ప్రాధమిక విద్య ను అభ్యసించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్  వర్సిటీ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ముక్కు సూటిగా వ్యవహరించే టీఎన్ శేషన్.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దేశవ్యాప్తం గా సుపరిచిత మయ్యారు.చట్టాలు ఎంత కఠినం గా ఉన్నా.. వాటిని అమలు చేసే వారిలో దమ్ము లేక పోతే ఏమీ చేయలేని పరిస్థితి. చట్టాన్ని సరైన రీతిలో నడిపిస్తే.. ఎన్నికలు ఎలా నిర్వహించొచ్చన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు టైగర్ టీఎన్ శేషన్. భారత ఎన్నికల స్వరూపాన్ని మార్చేయటమే కాదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ అంటే వణికే లా చేయటం లో ఆయన సక్సెస్ అయ్యారు. 1990-96 మధ్యన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తన పదవీ కాలంలో ఎన్నికల్లో భారీగా సంస్కరణలు చేపట్టారు. అప్పటివరకూ సాగుతున్న ఎన్నికల తంతును సమూలం గా మార్చేయటమే కాదు.. ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డుల్ని తీసుకొచ్చారు.ప్రచార వేళలు కుదింపు తో పాటు.. ఎన్నికల ఖర్చు విషయం లో డేగ కన్ను వేయటం తో పాటు.. ఇష్టా రాజ్యంగా వ్యవహరించే రాజకీయ పార్టీల కు షాకుల మీద షాకులు ఇవ్వటం ద్వారా ఈసీ అంటే భయంతో కూడిన భక్తి కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు.

 

 

 

 

 

 

 

 

ఎన్నికల వ్యయం నియంత్రణ వంటి సంస్కరణల్ని తీసుకురావటంలో విజయవంతమైన ఆయన.. 1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి గా సేవలు అందించారు. 1996లో ఆయన రామన్ మెగసెసే అవార్డు ను సైతం అందుకున్నారు. ఎన్నికల నిబంధనల్ని కఠినంగా అమలు చేయటం అన్న మాటకు నిలువెత్తు రూపంలా నిలిచిన టీఎన్ శేషన్ తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థాయి లో ఉన్నఎన్నికల ప్రధానాధికారి మరొకరు రాలేదని చెప్పక తప్పదు. ఎన్నికల ప్రధానాధికారి పదవికి గ్లామర్ తీసుకు రావటమే కాదు.. ఎన్నికల నిర్వహణ విషయం లోనూ పెను మార్పుల కు కారణంగా టీఎన్ శేషన్ గా చెప్పక తప్పదుఅప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అంటే.. కేంద్రం చెప్పినట్లు గా వినే అధికారిగా మాత్రమే ఇమేజ్ ఉండేది. అలాంటిది తన చేతలతో మొత్తంగా మార్చేయటమే కాదు.. ఎప్పటికి తరగని ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత టీఎన్ శేషన్ సొంతంగా చెప్పాలి. ఆయన గురించి ఎందుకంత గొప్ప గా చెబుతారు? ఆయనకు మిగిలిన వారికి తేడా ఏమిటి? ఆయన్ను ఎందుకంత గా పొగుడుతారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే.. ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే విషయం మొత్తం ఇట్టే అర్థమై పోతుంది.టీఎన్ శేషన్ కేబినెట్ సెక్రటరీ గా ఉండేవారు. అప్పట్లో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఒక రోజు టీఎన్ శేషన్ ను పిలిపించిన రాజీవ్ గాంధీ.. కొన్ని తేదీలు చెప్పి.. ఆ వేళల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు చెప్పండంటూ ఆదేశించారు. ఇలాంటి పరిస్థితే వేరే వారికి ఎదురైతే.. వెనుకా ముందు చూసు కోకుండా ఓకే సార్ అని చెప్పటమే కాదు.. తమ విధేయతను ప్రదర్శించేవారు.

 

 

 

 

 

 

 

 

కానీ.. అందుకు భిన్నంగా టీఎన్ శేషన్. ప్రధాని రాజీవ్ మాటలు సరి కావన్న విషయాన్ని ఆయన కే సూటిగా చెప్పటమేకాదు.. అలాంటి తీరు సరికాదని.. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ అని.. ఎన్నికల తేదీల్ని డిసైడ్ చేయాల్సింది ఈసీనే అన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని మాత్రమే చెప్పగలమని మాత్రమే ప్రధాని రాజీవ్ కు తేల్చి చెప్పారు.ఇంత దమ్ము.. ధైర్యం ఇప్పటి అధికారుల నుంచి ఆశించ గలమా? అధినేతల నోటి నుంచి మాట వచ్చింది మొదలు పూర్తి చేసే వరకూ నిద్ర పోని నేటి అధికారులకు.. టీఎన్ శేషన్ కు మధ్య నున్న వ్యత్యాసం ఈ ఉదంతం చెప్పేస్తుంది. అంతేకాదు.. ఎన్నికల సంస్థ భారత ప్రభుత్వంలో భాగం కాదు.. అదో స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని రాజకీయ పార్టీలకు.. ముఖ్యంగా అధికార పక్షాలకు అర్థ మయ్యేలా చేయటం లో ఆయన కీలక భూమిక పోషించారు.పుస్తకాల్లో రాసి ఉన్న దానికి.. ఆచరణలో అమలు చేయటానికి మధ్యనున్న వ్యత్యాసం చాలానే ఉంటుంది. ఆ నిజాన్ని గుర్తించటమే కాదు.. వ్యవస్థ లోని మోనాట నిజాన్ని మొదటి కంటా తుంచేయటంలోనూ టీఎన్ శేషన్ ను సాటి వచ్చే అధికారి ఇటీవల కాలంలో లేరన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. మిగిలిన శాఖలకు ఏదైతే నోట్ లు పంపుతారో.. మంత్రులు.. అధికారపక్షం నేతలు ఎన్నిక సంఘాని కి అదే రీతిలో నోట్ లు పంపే కల్చర్ కు బ్రేకులు వేయటం లో శేషన్ కీల భూమిక పోషించారని చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

ఈసీ ఒక స్వతంత్ర వ్యవస్థ అని.. దానికి ఇలా చేయండి.. అలా చేయండని నోట్ పంపటం సరికాదన్న విషయాన్ని తాను చాలా మర్యాద గా చెప్పే వాడినంటూ శేషన్ పలు సందర్భాల్లో ప్రస్తావించేవారు. కేంద్ర న్యాయశాఖామంత్రిని కలుసుకోవటం కోసం ఆయన ఆఫీసు బయట ఎన్నికల కమిషన్లు వెయిట్ చేసేవారు. కానీ.. అలాంటి వాటిని బద్ధలు కొట్టటమే కాదు.. ఎన్నికల కమిషన్ కు ఉన్న రాజ్యాంగపరమైన హోదా ఎంతన్న విషయాన్ని పాలకులకు.. రాజకీయ పార్టీల కే కాదు ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో టీఎన్ శేషన్ కీలక భూమిక పోషించారని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి.. టీఎన్ శేషన్ మాదిరి అధికారులు మీ చుట్టూ ఉన్న ప్రపంచం లో ఎంతమంది కనిపిస్తారు? . రాజకీయ పార్టీల కు సింహ స్వప్నంగా నిలిచి.. టైగర్ అన్న ముద్దు పేరును ప్రజల చేత పిలిపించుకున్న ఘనత శేషన్ కు మాత్రమే దక్కుతుందనటం లో సందేహం లేదు.

 

హసీనాబీకి ఎవరైనా ఆశ్రయం ఇస్తే కేసులు

 

Tags:Election reformer TN Sheeshan passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *