Natyam ad

ఎన్నికలే ఒక స్టాటజి …కుప్పం, పిఠాపురం గెలుస్తాం

– రెండవ సారి జగన్‌ సీఎం కావడం ఖాయం
– మ్యానిఫెస్టో బేష్‌ …
– కిరణ్‌కు సొంత ఇల్లు లేదు
– ఏపిలో పోటీ చేసే నైతికత కిరణ్‌కు లేదు
– జగన్‌ అప్పగించే పనులు సక్సెస్‌ చేయడమే లక్ష్యం
– రాయలసీమలో 90 శాతం గెలుస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎన్నికలు ఒక స్టాటజి…. దానిని చెప్పడం ఎలా…ఎలా చేస్తామో చెబితే ఇంకేముంది… కుప్పం, పిఠాపురంలో చంద్రబాబు , పవన్‌కళ్యాణ్‌లను ఓడిస్తామని, వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టో చాలా బాగుందని , జూన్‌ 4 పైన రెండవ సారి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు అంటు పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం సాయంత్రం   తెలిపారు. మున్సిపాలిటిలో ఎన్నికల ప్రచారాన్ని శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి తో కలసి ఇంటింటికి వెళ్లి నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టక్రిందపాళెంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఇచ్చిన ఉప ఎన్నికల బాధ్యతలను పటిష్టంగా నిర్వహించామన్నారు. ప్రస్తుత ఎన్నికలను కూడ పటిష్టంగా నిర్వహించి రాయలసీమలో 90 శాతం పైగా స్థానాలు గెలుస్తామన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి నైతికత లేదన్నారు. అసెంబ్లిలో కిరణ్‌ మాట్లాడుతూ తాను తెలంగాణ బిడ్డనని, ఇక్కడే జన్మించానని చెప్పిన వ్యక్తి అని ఎద్దెవ చేశారు. అలాంటి వ్యక్తి ఏపిలో పోటీ చేయడం హాస్యాస్పదమన్నారు. సొంత ఇల్లు లేదు. ముఖ్యమంత్రిగా జిల్లాను అభివృద్ధి చేసింది లేదు. ఏవెహోహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్‌ అంటు మండిపడ్డారు.

 

 

 

రాజంపేట ఎన్నికల్లో మిధున్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని, కిరణ్‌కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. కూటమిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అవకాశవాద రాజకీయాలు ఏనాటి నుంచినో చూస్తున్నామన్నారు. ప్రజలు ఇలాంటి వారికి తగిన గుణ పాఠం నేర్పుతారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రశ్నించగా సీఎం విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని రకాలుగా పరిశీలించి తయారు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అమలు చేసేవి మాత్రమే హామి ఇచ్చారని, అమలు చేయలేని హామిలు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రస్తుతం మ్యానిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. 2019 ఎన్నికల్లో కూడ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాయమాటలు చెప్పే నైజం జగన్‌ది కాదని తెలిపారు. ఉమ్మడి పార్టీల వారు ఇచ్చే మ్యానిఫెస్టోను ఓటర్లు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము పాల్గొన్నారు.

 

Tags: Elections are a stage…we will win Kuppam and Pithapuram

 

Post Midle