ఓటర్ల జాబితా పకడ్బంధిగా ఏర్పాటు చేయాలి

Electoral list should be established as a hawk

Electoral list should be established as a hawk

Date:13/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఓటర్ల జాబితాను పకడ్బంధిగా ఏర్పాటు చేయాలని తహశీల్ధార్‌ మాదవరాజు, కమిషనర్‌ కెఎల్‌.వర్మ సూచించారు. గురువారం మున్సిపాలిటిలో ఓటర్ల జాబితా , సవరణలు, చేర్పులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాదవరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు ఓటర్ల నమోదును పటిష్టంగా చేపట్టామన్నారు. ఓటర్లు రెండు ప్రాంతాలలో ఉంటే వారిని విచారించి, వారికి అవసరమైన ప్రాంతంలో ఓటును ఉంచి, మరోప్రాంతంలో తొలగించాలన్నారు. అలాగే మరణించిన వారి ఓట్లను, గ్రామాలలో లేనివారి ఓట్లను ఖచ్చితంగా తొలగించాలన్నారు. ఓటరుగా నమోదైన వారందరి పేర్లు ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఈవిషయాలలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్ధార్‌ రమేష్‌బాబు, ఆర్‌ఐ రెడ్డెప్ప, బిఎల్‌వోలు పాల్గొన్నారు.

అక్రమాల గుట్లు

 

Tags: Electoral list should be established as a hawk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *