విద్యుత్ షాక్ రైతుకు తీవ్రగాయాలు
పరిగి ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా దొమ మండలం రాకొండలో విద్యుత్ షాక్ తో రైతు పిల్లి అంజిలయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. పొలం బోరు బిల్లు ఏడు వేలు ఉండడంతో విద్యుత్ బిల్లు కట్టాలని లైన్ మెన్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. రెండు వేలు మాత్రమే తన దగ్గర ఉన్నాయని ఆ రెండు వేలు కడతానని అంజిలయ్య చెప్పినా న వినకుండా లైన్ మెన్ విద్యుత్ సరఫరా కట్ చేసి వెళ్లిపోయాడు. నీళ్లు లేకపోవడంతో తన పొలం ఎండిపోతుందన్న భయంతో ఆదివారం రాత్రి సాయంత్రం తానే విద్యుత్ సరఫరా ఇచ్చే క్రమంలో ట్రాన్సఫర్మర్ దగ్గర విద్యుత్ షాక్ తగిలి తివ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దాడులను అరికట్టాలి
Tags: Electric shock severely injures the farmer