Natyam ad

చెరువులో చేపలు పడుతుండగా విద్యుత్ షాక్ -యువకుడి పరిస్థితి విషమం

-విద్యుత్ వైర్లు తలకు తగిలే అంత ఎత్తులో ఉండడంతోనే ప్రమాదం
-ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

 

తంబళ్లపల్లి ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మొలకలచెరువు మండలం, మద్దినాయునిపల్లి చెరువులో శనివారం ఉదయం ఘోరం చోటు చేసుకుంది. చెరువులో చేపలు పడుతున్న కర్ణాటక రాష్ట్రం దావనగిరి జిల్లా, సుడికేర్ వసల్లి కి చెందిన నాగప్ప కొడుకు ఫకీర్(30) మద్దినాయుని పల్లి గ్రామానికి చెందిన కిరణ్ కు రోజు సహచరులతో కలసి చేపలు పట్టి ఇస్తుంటాడు. ఈ క్రమంలో మద్ది నాయునిపల్లి చెరువులో ఉదయం చేపలు పడుతుండగా, ఫకీర్ తలకు విద్యుత్ వైర్లు తాకడంతో కరెంటు షాక్ కొట్టి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చెరువులో చేపలు పడుతున్న సహచరులు గుర్తించి బాధితుని చికిత్స కోసం వెంటనే 108సిబ్బంది మస్తాన్, బావాజాన్ ల సాయంతో హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రధమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు వెంటనే అతన్ని బెంగుళూరు కు తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ వైర్లు చెరువులో తలకు తగిలే అంత ఎత్తులో వేలాడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పలుమార్లు సంబంధిత అధికారులకు చెరువులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని వారు మండిపడ్డారు. కరెంట్ షాక్ కొట్టడం వల్ల కర్ణాటక వాసి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో, ట్రాన్స్కో అధికారులు హడావిడి చేస్తున్నడంపై వారు తీరును తప్పు పట్టారు… మొలకలచెరువు పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

 

tags: Electric shock while fishing in the pond – the condition of the youth is critical

Post Midle