Natyam ad

టేబుల్ తుడుస్తూ విద్యుత్ షాక్

మృతి చెందిన వివాహిత

తిరుపతి ముచ్చట్లు:


ఇంట్లో టేబుల్ తుడుస్తూ విద్యుత్ షాక్ కు గురై  మాధవి అనే  మహిళ మృతి చెందింది.   చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన పారిచర్ల మాధవి (27) శనివారం ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న టేబుల్ ఫ్యాన్ వైర్లు తగిలి మాధవి అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. చిల్లకూరు ఎస్సై బి గోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Electric shock while wiping the table

Post Midle