బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
కడప ముచ్చట్లు:
కడప జిల్లా చెన్నూరు కొత్త రోడ్డు వద్ద గల ముద్దల సుబ్బయ్య స్వీట్ స్టాల్, బేకరీ, క్యాటరింగ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో స్వీట్ స్టాల్, బేకరీ, క్యాటరింగ్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్వీట్ షాప్ లో గల యంత్రాలతో సహా, 10 లక్షల రూపాయల నగదు, ఫ్రిజ్ లు, గ్రైండర్లు, భూమి పాస్ బుక్కులు, మరియు డాక్యుమెంట్లతో సహా కాలి బూడిద అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ రాత్రి 12 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కడప ఫైర్ ఇంజన్ ద్వారా ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు ఆర్పివేసారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ సంఘటన స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. – అనంతరం షాపు యజమాని లడ్డు బాబు కు ధైర్యం చెప్పి, ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపు 35 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిసింది.
Tags; Electrical short circuit in bakery

