Natyam ad

నాణ్యత వస్తువులను వినియోగిస్తే విద్యుత్‌ ఆదా అవుతుంది – ఎస్‌ఈ కృష్ణారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

విద్యుత్‌ను ఆదా చేసుకునేందుకు పలు విధానాలను పాటించాలని విద్యుత్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌ వినియోగ మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్‌ను పొదుపు చేయాలని నిర్వహిస్తున్న రెండవ రోజు సదస్సుకు ఎస్‌ఈతో పాటు రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌లు హాజరైయ్యారు. ఎస్‌ఈ మాట్లాడుతూ ఇండ్లలో వినియోగిస్తున్న బల్భుల నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు తదితర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. దీని ద్వారా విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. నాణ్యత లేని వస్తువులతో విద్యుత్‌ అధిక వినియోగంతో పాటు బిల్లులు అధికంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే వస్తువుల్లో నాణ్యత ఉండదన్నారు. ముఖ్యంగా బొగ్గు వినియోగంతో కాలుష్యం తీవ్రమౌతుందని, దీనిని నియంత్రించేందుకు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం జరుగుతోందన్నారు. విద్యుత్‌ను తయారు చేసేందుకు సహజ సిద్దమైన సూర్యరశ్మిని విద్యుత్‌గా తయారు చేసుకోవడం జరుగుతోందన్నారు. అనేక ప్రాంతాలలో సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ కేటాయించిన మేరకే వినియోగించాలన్నారు. సోలార్‌ ద్వార మనకు అవసరమైన విద్యుత్‌ను సేకరించుకునేందుకు వీలుందన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్‌ను వినియోగించే సమయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఈఈ శ్రీనివాసమూర్తి, డీఈఈ రవి తో పాటు ఏఈలు , సంస్థ ప్రతినిధులు వెంకట్రమణ, డిఈఈలు శ్రీనివాసులు, మహేష్‌, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది , సచివాలయ ఎనర్జీ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Electricity can be saved by using quality products – SE Krishna Reddy

Post Midle