ఆరడిగుంటలో రూ.5 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

– పెద్దిరెడ్డి

Date:30/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

పడమటి మండలంలోని గ్రామాల్లోని రైతులకు లోఓల్టేజ్‌ సమస్య లేకుండ ఉండేందుకు రూ.5 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి సబ్‌ స్టేషన్‌ నిర్మాణాలకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్‌ సమస్య లేకుండ ఉండేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మారుమూల గ్రామమైన ఆరడిగుంటలో సబ్‌స్టేషన్‌ మంజూరు చేయించారని తెలిపారు. ఈ సబ్‌స్టేషన్‌ ద్వారా సుమారు ఇరవై గ్రామాల ప్రజలకు విద్యుత్‌ సమస్యలేకుండ పోతుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారుమూల గ్రామాలలో సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, సబ్‌స్టేషన్లు, వెల్‌నెష్‌ సెంటర్లు, ఆర్‌బికెలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు రెడ్డెప్పరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నంజుండప్ప, వంటల రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆలయం ప్రారంభం….

మండలంలోని ఆరడిగుంటలో శ్రీ ప్రసన్న పార్వతిసమేత నంజుండేశ్వరస్వామి ఆలయంలో విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు.

ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

Tags; Electricity substation at Aradigunta at a cost of Rs 5 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *