వి.కోట పట్టపగలే పంటలపై—-ఏనుగుల దాడులు:

జనారణ్యంలోకి—-ఏనుగుల మంద:

జాతీయ రహదారిపై—-ఏనుగుల గుంపు హల్చల్:

బంతి…టమోటా..మామిడి—-పంటలు ధ్వంసం:

చుట్టుముట్టిన జనాలు—-దిక్కు తోచని ఏనుగులు:

నష్టపోయిన—–అన్నదాతలు:

 

వి.కోట ముచ్చట్లు:

 

అర్ధరాత్రి రంగప్రవేశం చేశాయి….తోటల్లో చొరబడ్డాయి….పొద్దు పుట్టిన పట్టించుకోలేదు….రోడ్డుపైకొచ్చాయి…..భయపెట్టాయి……కంటి మీద కునుకు లేకుండా చేశాయి….పట్టపగలే పంటలను ధ్వంసం చేశాయి….జనాలు చుట్టుముట్టారు….దిక్కుతోచక దిక్కులు తిరిగాయి….ఘీంకారాలతో హోరెత్తించాయి……ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి…జనాల కేరింతలతో…వెంబడించారు….అడవి బాట పట్టించారు….అందరూ ఊపిరి పీల్చుకున్నారు.చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.పట్టపగలే జనారణ్యంలోకి దూసుకొచ్చింది…గత 6 రోజులుగా 14 ఏనుగుల గుంపు అటవీ సరిహద్దు గ్రామాల రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి….ఈ క్రమంలోనే రాత్రి గుంపు కుమ్మరమడుగు,వెంకటేపల్లి,దానమయ్యగారిపల్లి మీదుగా చింతలగుంట,మధ్దిరాళ్ల తదితర పంటల్లోకి చొరబడ్డాయి…ఈ గుంపు నుంచి ఓ ఏనుగు విడిపోయింది.దానమయ్యగారిపల్లి లవకుమార్ మామిడితోపులో మకాం వేసింది..ఎకువజాము నుండి తోలేందుకు ప్రయత్నాలు చేసినా ముందుకు కదల్లేదు.ఉదయం 6 గంటలకు ట్రాకర్స్,రైతులు,గ్రామాల ప్రజలు బాణాసంచా పేలుస్తూ మళ్లించేందుకు ప్రయత్నం చేశారు..ఈ క్రమంలో ఓ కోళ్లఫారం పై దాడి చేసింది.అనంతరం వెంకటేపల్లి గ్రామానికి చెందిన అప్పయ్యరెడ్డి టమోటా తోటను తొక్కి ధ్వంసం చేస్తూ ముందుకు సాగింది.టీవీఎస్ వాహనాన్ని కాళ్లతో తొక్కి నాశనం చేసింది.ప్రజలు చుట్టుముట్టడంతో కుమ్మరమడుగు పాఠశాల వద్ద జాతీయ రహదారిని దాటింది…కోపంతో ప్రహరీ గోడను కూల్చేందుకు యత్నించింది.పక్కనే ఉన్న టెంపో వాహనం పై దాడి చేసింది..జనాల కేరింతలు పెరగడంతో పచ్చారమాకలపల్లె గ్రామం వైపు దూసుకుపోయింది.పంటలను కూల్చుతూ వెళ్లింది..వెంబడించడంతో ఎట్టకేలకు గ్యాస్ పంపింగ్ స్టేషన్ వద్ద అడవిలోకి జారుకుంది..అనంతరం ఏడగురికి గ్రామం వద్ద ఏనుగుల గుంపు ఉందని సమాచారం

 

 

 

 

తెలిసింది…శీకార్లపల్లి,పచ్చారమాకులపల్లె,కొమ్మరమడుగు,వెంకటేపల్లి, దానమయ్యగారిపల్లి,చింతలకుంట తదితర గ్రామాల్లో ప్రజలు ఏడుగురికి గ్రామం వెనుక వైపు ఉన్న గోపాల నాయుడు మామిడి తోపును చుట్టుముట్టారు.వందల మంది జనాలు చేరడంతో 13 ఏనుగుల గుంపు దిక్కుతోచక ఘీంకారాలతో హోరెత్తించాయి.దిక్కులు తిరిగాయి..ఒకానొక దశలో జనాలపైకి దూసుకొచ్చాయి.పలువురు తప్పించుకున్నారు…జనాన్ని కట్టడి చేయడానికి వి.కోట సీఐ తన బలగాలతో ఏడగురికి గ్రామం వద్దకు చేరుకున్నారు.నియంత్రించడానికి ప్రయత్నం చేశారు…ట్రాకర్స్ బాణాసంచా పేలుస్తూ గుంపుని మళ్లించారు…దానమయ్యగారిపల్లి పంటపొలాల మీదుగా హంద్రీనీవా కాలువ వద్ద వి.కోట-పలమనేరు జాతీయ రహదారిని దాటాయి.దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి…వెంకటేపల్లి గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి బంతి పూల తోటను తొక్కి నాశనం చేశాయి..అనంతరం వందల మంది జనాలు వెంబడిస్తూ వెళ్లడంతో కొమ్మరమడుగు పొలాలమీదుగా అడవిలోకి ప్రవేశించారు.ఏనుగుల గుంపు వెళ్తోందన్న సమాచారంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తిలకించేందుకు వచ్చారు.ఎక్కడ చూసినా జనాలతో పంటపొలాలు నిండిపోయాయి..అటవీశాఖ అధికారులు,ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.తోటకనుమ బీట్ అధికారి చరణ్,ట్రాకర్స్ వెంకట రమణ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: — Elephant Attacks on Crop Graduation Crops :–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *