Natyam ad

ఏనుగు సంచారం…వ్యక్తికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం గంటాఊరు గ్రామ సమీపంలో శనివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది.  ఓ చెరువు వద్ద తచ్చాడుతూ కనిపించింది. దీంతో కొంతమంది గజరాజు సమీపంలోకి వెళ్ళగా  ఆ వ్యక్తులను ఘింకరిస్తూ తరిమింది. దాంతో బిత్తరపోయిన ఆ వ్యక్తులు కింద మీద పడి లేచి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి తృటిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ , ఏనుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వాటిని కవ్వించే ప్రయత్నాలు ఎవరు కూడా చేయవద్దని ప్రాణాలు మీదకి తెచ్చుకోవద్దన్నారు.  క్షణం ఏమరపాటుతో  వున్నాతొక్కి చంపేస్తాయన్నారు.  గతంలో కూడా ఏనుగుల దాడిలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

 

Tags; Elephant wandering…a man’s fatal mistake