బెల్లం గోవిందరెడ్డి పల్లి లో పంటలు ధ్వంసం చేసిన ఏనుగులు

భారీగా వ్యవసాయ పంటలు నష్టం… ఆందోళనలో రైతులు

 

చిత్తూరు ముచ్చట్లు:

Post Midle

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి వ్యవసాయ పంటపొలాల పై దాడులు చేసి పంటలను ధ్వంసం చేయడం చేత రైతులు భారీగా నష్టపోతున్నామని పొలకల గ్రామపంచాయతీ పరిధిలోని బెల్లం గోవిందరెడ్డి పల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శివ కుమార్ రెడ్డి, పరంధామ నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము అధిక వడ్డీలకు అప్పులు చేసి చెరుకు, పనస, కొబ్బరి, పశుగ్రాసం , గానుగ సామాగ్రి,వంటి వ్యవసాయ పంటలు సాగు చేశామని, అయితే స్థానిక అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ కరువవడంతో ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి బుధవారం రాత్రి తాము సాగు చేసిన పంటలపై ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఏనుగులు గుంపులు గుంపులుగా అడవి ప్రాంతంలో తిష్ట వేస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప తమ పంటలకు రచన కల్పించాలని రైతులు వెల్లడించారు. కావున ఇప్పటికైనా సంబంధిత జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించి, ఏనుగులు తిష్టవేసిన ప్రాంతాల్లో పర్యవేక్షించి, వ్యవసాయ పంటలను ఏనుగుల భారీ నుండి రక్షణ కల్పించి, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

Tags: Elephants destroying crops in Bellam Govindareddy Palli

Post Midle
Natyam ad