విశాఖలో మూడు నెలలలో పదకొండుహత్యలు

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ నగర పరిధిలో కొంతకాలంగా జరిగిన హత్యలన్నీ కేవలం క్షణికావేశం లోనే జరిగాయని, ముఠా తగాదాలు కావని విశాఖ నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు.గత మూడు నెలలుగా విశాఖ నగరంలో 11 హత్యలు జరిగాయని,వీటిలో ఇద్దరు రౌడీషీటర్లు మృతి చెందారన్నారు. ఈ హత్యల్లో నేరుస్థులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామన్నారు. విశాఖ నగర టాస్క్ ఫోర్స్ లో యాంటీ గూండా స్క్వాడ్, నార్కోటెక్ విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. యాంటి గూండా స్క్వాడ్ ద్వారా గత మూడు నెలల్లో 49 మంది రౌడీషీటర్లతో పాటు వారికి సహకరిస్తున్న 38 మందిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. రౌడీ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిపై నగర బహిష్కరణ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీరిలో కొందరు జైలులో ఉన్నారని.. వచ్చిన వెంటనే నోటీ సులు జారీ చేస్తామన్నారు. మరో నలుగు రిపై పీడీ యాక్ట్ నమోదుకై చర్యలు తీసు కుంటున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి వంటివి తాగుతున్న యువతపై దృష్టి సారించి 4 నెలల్లో 128 కేసులు నమోదు చేసి 318 మందిని జైలుకు పంపించామన్నారు.

 

Tags: Eleven murders in Visakhapatnam in three months

Leave A Reply

Your email address will not be published.