అక్రమణలను తొలగించండి

Date:20/10/2020

కాకినాడ ముచ్చట్లు

తూర్పుగోదావరి జిల్లాలో జలవనరుల శాఖ కాలువలు, డ్రెయినేజీ వ్యవస్థలపై ఉన్న ఆక్రమణలన్నింటినీ తక్షణమే తొలగించాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో

జలవనరులు, డ్రెయిన్లు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4,075 ఆక్రమణలు గుర్తించామనీ వెంటనే ఆక్రమణలు తొలగింపునకు

కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎస్ఈలు ఆర్.శ్రీనివాసకృష్ణ, బి.ఎస్ఎస్ శ్రీనివాసయాదవ్, డీఆర్వో సత్తిబాబు, జేడీఏ ప్రసాద్, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహనరావు పాల్గొన్నారు.
కోరింగ అభయారణ్యం జోన్ పరిధి నిర్ధారణకు ప్రతిపాదనలు
కోరింగ వన్యప్రాణి అభయారణ్యం రక్షణకు చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి నిర్ధారణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో

సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అరణ్యానికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో 50 మీటర్ల వృత్త పరిధిలోనూ, హోప్ ఐలాండ్ ఉత్తర దిక్కుకు పెరుగుదల దృష్ట్యా ఆ వైపున 500

మీటర్ల పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్‌ను సవరణకు జిల్లా కమిటీ చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్, డీఎఫ్‌వోలు సి.సెల్వం, సునీల్‌కుమార్ రెడ్డి, జేసీ

జి.రాజకుమారి, అధికారులు పాల్గొన్నారు.
దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పన
జిల్లాలో దోషరహిత ఓటర్ల జాబితాల రూపకల్పనకు చర్యలు చేపట్టామని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2021,

జవనరి 15వ తేదీన జిల్లా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021, జనవరి 18న తుది ఓటర్ల జాబితా

ప్రచురిస్తామన్నారు. ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకోవాలన్నారు.

ఆదోని జిల్లా సాధనకై  జరుగు బైక్ యాత్రను జయప్రదం చేద్దాం

Tags:Eliminate invasions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *