ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఎల్లెర్ గడ్డలు
మెదక్ ముచ్చట్లు:
ఎల్లెర్ గడ్డలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కౌడిపల్లి మండలం, వెంకట్రావు పేట గ్రామంలో ఘటన జరిగింది.బాధిత కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఎల్లెర్ గడ్డలు జున్ను పాలల్లో కలుపుకుని తిన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొడుకు శ్రీనివాస్ మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం తల్లి వెంకటమ్మ చనిపోయారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. వైద్యుల నిర్లక్ష్యంగానే చనిపోయారని బంధువుల ఆరోపించారు.
Tags: Eller’s bumps that claimed two lives

