ఎల్లుండే సెంట్రల్ కేబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 8న ఉదయం 10:30కి కేంద్ర కేబినెట్‌ విస్తరణ ఉండవచ్చని సమాచారం. 20 మందికి పైగా కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్‌ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్‌ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్‌సీపీ సింగ్‌, లల్లాన్‌ సింగ్‌, అప్నా దళ్‌ నేత అనుప్రియ పాటిల్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Ellunde Central Cabinet Expansion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *