ఎల్లుండే మూడో విడత రైతు రుణమాఫీ

తెలంగాణ  ముచ్చట్లు:

 

ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేసిన సీఎం రేవంత్.అన్నట్లుగానే ఎల్లుండి మూడో విడత రైతు రుణమాఫీ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి.దేశ చరిత్రలోనే 32.50 లక్షల మంది రైతులకు రుణ విమూక్తి కల్పించేందుకు రూ.31 వేల కోట్లు కేటాయించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం.మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్.ఇక రెండో విడత కింద రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.మూడో విడతలో లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభిస్తారు.

 

Tags: Ellunde third installment of farmer loan waiver

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *