ఊపందుకున్న అండర్ వేర్ ఉద్యమం

Embracing Underwriting Movement

Embracing Underwriting Movement

Date:17/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఐర్లాండ్‌లో ఇటీవల మొదలైన మహిళల అండర్‌వేర్‌ ఉద్యమం ఇప్పుడు మరికొన్ని దేశాలను కుదిపేస్తోంది. అత్యాచార కేసు విచారణలో భాగంగా యువతి అండర్‌వేర్‌ను న్యాయవాది కోర్టులో చూపించడం వివాదాస్పదమైంది. కోర్టులో అండర్ వేర్ చూపించడాన్ని ప్రశ్నిస్తూ ఐర్లాండ్ మహిళా నేత, ఎంపీ రుత్ కొప్పింగర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎంపీ రుత్ కొప్పింగర్ అండర్ వేర్‌ను పార్లమెంట్‌లో చూపిస్తూ కోర్టులో ఇలా చేయడం పద్ధతేనా అని సభ్యులను ప్రశ్నించారు. తన అండర్ వేర్ ఫొటోతో ThisIsNotConsent అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. మహిళ అండర్‌వేర్‌ను సాక్ష్యంగా చూపించడం భావ్యం కాదని, ఆమె లోదుస్తులు శృంగారానికి సమ్మతించడం కాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. కార్క్ అనే పట్టణానికి చెందిన 17 ఏళ్ల యువతి ఇటీవల అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడైన 27 ఏళ్ల వ్య‌క్తిని న్యాయస్థానం నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. అందుకు కారణం యువతి అండర్‌వేర్. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. కేసు విచారణ సమయంలో డిఫెన్స్‌ లాయ‌ర్ మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను కోర్టులో చూపించారు. యువతి ఎలాంటి లోదుస్తువు వేసుకుందో చూడండి. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి లోదుస్తులు వేసుకుని పురుషులను ఆకర్షించే యత్నం చేయడం బాధితురాలి తప్పిదమేనని వాదించారు. అత్యాచారం చేసిన యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పివ్వడం మహిళలను మరింత ఆవేశానికి లోను చేసింది. 8 మంది సభ్యుల ధర్మాసనం ఇలాంటి తీర్పు ఇవ్వడమేంటని తమ అండర్‌వేర్‌లతో మహిళలు నిరసన తెలుపుతున్నారు. యువతిని మేము నమ్ముతున్నామని ఐర్లాండ్ అత్యాచార బాధితురాలకి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ThisIsNotConsent అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ అండర్ వేర్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. పురుషులు సైతం బాధితురాలికి మద్దతుగా ధర్నాలు చేసి నిరసన తెలుపుతున్నారు. కోర్టులో యువతి అండర్ వేర్‌ను ప్రదర్శించడం మహిళా లోకాన్ని అవమానించడమేనని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:Embracing Underwriting Movement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *