ఎమ్మెల్సీ కవిత మరిన్ని ఉన్నత పదవులు పొందాలి

-ఎమ్మెల్సీ కవితకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

 

జగిత్యాల ముచ్చట్లు :

 

స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలు  కవితక్క రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు పొంది రాజకీయాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి లు అభిప్రాయపడ్డారు.నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ,ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత, నిజామాబాదు మాజీ పార్లమెంట్ సభ్యురాలు,  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రపంచానికి బతుకమ్మ ను పరిచయం చేసిన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచు  కల్వకుంట్ల కవితక్క – అనిల్ దంపతులకు జగిత్యాల జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావా వసంత, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు వొద్ది శ్రీలత, గడ్డం లత, సిరికొండ పద్మ, కుసరి అనిల్, నారాయణ రెడ్డి, కూతురు పద్మ, ప్రేమలత, మల్లవ్వ, తిరుపతమ్మ,జగిత్యాల పట్టణ  మహిళా విభాగం కార్యదర్శి  కస్తూరి శ్రీమంజరి, ప్రభాత్ సింగ్, సామ్రాట్ లు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.  జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ  ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులకూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే కవిత రాష్ట్ర ప్రజలకు సేవచేసే విదంగా పదవులు పొందాలని ఆశిస్తూ ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు   దావా వసంత, మున్సి పల్ ఛైర్పర్సన్ శ్రావణి,టీఆర్ఎస్ మహిళా విభాగం జగిత్యాల పట్టణ కార్యదర్శి కస్తూరి శ్రీమంజరి లు మాట్లాడుతూ కవితక్క మరిన్ని ఉన్నత పదవులు పొంది  ప్రజా సేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని  ఆకాంక్షించారు.

మార్కెండేయ ఆలయంలో శ్రీమంజరి పూజలు…..

జగిత్యాల పట్టణ తెరాస మహిళా విభాగం కార్యదర్శి కస్తూరి శ్రీమంజరి బుధవారం జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ కవిత పెళ్లి రోజు సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయానికి వెళ్లిన శ్రీమంజరి కవిత-అనిల్ ల గోత్రనామాదులతో అర్చనలు చేయుంచి, ఆయురారోగ్యాలు, సౌభాగ్యలతో ఉండాలని, రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Emelsie Poetry should get more high ranks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *