నేల చూపులు చూస్తున్న పచ్చబంగారం

నిజామాబాద్ ముచ్చట్లు :
బంగారం ధర ఆకాశాన్నంటుతుంటే వ్యవసాయ మార్కెట్ లో పచ్చ బంగారం నేల చూపులు చూస్తోంది. ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులు కుమ్మక్కై పసుపు రైతుల కంట్లో కారం కొడుతున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులు రాకా పసుపు రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల దయనీయ పరిస్థితులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు కరోనాతో మార్కెట్ లో కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్న అన్నదాతలకు తాజాగా మద్దతు ధర రూపంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో క్రయ విక్రయాలు జరుగుతున్నా గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. లాక్ డౌన్ కంటే ముందు సుమారు 10 లక్షల క్వింటాళ్ల పసుపును వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో క్వింటాకు నాలుగు వేల ఐదు వందల నుంచి 5 వేల వరకు ధర పలికింది. అయితే పసుపు విక్రయాలు ఊపందుకునే దశలో..కరోనా ప్రభావంతో మార్కెట్ యార్డుకు తాళాలు పడ్డాయి రెండు నెలల తరువాత మళ్లీ మార్కెట్ ఓపెన్ అయినా రైతులకు తీవ్ర నిరాశే ఎదురౌతోంది. ఈ నామ్ రూపంలో క్రయ విక్రయాలు జరుగుతున్నా..పసుపు ధర నేల చూపులు చూస్తోంది. క్వింటాలుకు 5 వేల నుంచి 5 వేల 5 వందల వరకు మాత్రమే పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మూలంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పసుపు రైతులు ఇప్పుడు మద్దతు ధర లేక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Emerald looking at the ground

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *