Natyam ad

ప్రకాశం జిల్లాలో మరకత విగ్రహం

ఒంగోలు ముచ్చట్లు:

ప్రకాశం జిల్లాలో మరకత విగ్రహం టాక్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్ట్‌గా మారింది. అత్యంత పురాతన మరకత విగ్రహం పట్టుబడిందన్న వార్త జిల్లాలో సంచలనంగా మారింది. యర్రగొండపాలెంలో ఐదు ముఖాలు కలిగిన పురాతన వినాయక విగ్రహం దొరికినట్లు తెలుస్తోంది. పంచ ముఖాలు కలిగిన ఈ మరకత విగ్రహాన్ని 25 కోట్ల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది కూడా సామాన్యులు కాదని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తులే ఈ మరకత విగ్రహాన్ని పాతిక కోట్ల రూపాయలకు అమ్మేందుకు బేరసారాలు చేయడంతో ఇది బయటపడిందని అంటున్నారు. మరకత విగ్రహంపై లావాదేవీలు జరుపుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు, వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మరకత విగ్రహం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లంతా ప్రముఖులే కావడంతో గుట్టుగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. పక్కా సమాచారంతో నిఘా అధికారులు వాళ్లను పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పొలిటీషియన్స్ పైరవీలతో ఆ మరకత విగ్రహాన్ని యర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లిపోయినట్లు టాక్‌ వినిపిస్తోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ మరకత విగ్రహం ప్రస్తుతం యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌ ఉందని చెబుతున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఫుల్‌ డిటైల్స్‌ వెల్లడిస్తామని అంటున్నారు పోలీసులు.

 

Tags: Emerald statue in Prakasam district

Post Midle
Post Midle