Natyam ad

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ

న్యూఢిల్లీ,  ముచ్చట్లు:

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన FedEx ఎయిర్‌ క్రాఫ్ట్‌ టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. అప్రమత్తమైన అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 10-11 గంటల వరకూ ఈ ఎమర్జెన్సీ కొనసాగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఫెడెక్స్ కార్గో ఉదయం 10గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. కుడి వైపు ఓ పక్షి వచ్చి ఢీకొట్టింది. గమనించిన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గంట సేపటి తరవాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

Post Midle

Tags;Emergency at Delhi Airport

Post Midle